Thursday, July 16, 2020

దేవుడు ఎన్నటికీ నిన్ను విడువడు.

నిన్ను రక్షించువాడను నేనే 

పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రము ప్రకారం, మనము పూర్తి విధేయతలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనతో ఉంటాడు.   కానీ మనము తప్పినప్పుడు ఆయన మనల్ని వదిలివేస్తాడు.  అయితే, ఈ రోజు, మీరు మరియు నేను పూర్తిగా భిన్నమైన నిబంధనకాలములో ఉన్నాము మరియు దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు.

యేసు సిలువపై చేసిన దానివలన ఇది సాధ్యపడుతుంది.  సిలువ యొద్ద, అతడు మనకొరకు దహనబలిగా మారాడు. అతడు మన పాపాలను మరియు మన శిక్షను భరించాడు.  మన పాపాల కొరకైన దేవుని తీర్పు యేసు మీద పడింది.  అయన తన తండ్రి చేత సిలువలో విడిచిపెట్టబడ్డాడు.  తద్వారా ఈ రోజు మన జీవితాలలో దేవుని నిరంతర ఉనికిని పొందగల్గుచున్నాము.  దేవుడు మనల్ని ఎన్నటికీ విడువడు. 

యేసు "నా దేవా, నా దేవా, నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టావు?" అని అరిచాడు; సిలువపై ఏమి జరిగిందో నీకు మరియు నాకు అర్ధమవడానికి ఆయన ఆలా కేక వేశాడు  (మత్తయి 27:46).  అక్కడే దైవిక మార్పిడి జరిగింది.  సిలువలో, యేసు మన పాపాలను తీసుకొని దేవుని సన్నిధిని వదులుకున్నాడు; మనము యేసు యొక్క నీతిని తీసుకొని యేసుకు గల దేవుని సన్నిధిని అందుకున్నాము. దేవుని ఉనికి ఇప్పుడు శాశ్వతంగా  మనది.  ఎంతటి  దైవిక మార్పిడి!

క్రీస్తులో మన వారసత్వం గురించి బైబిల్ ఏమి చెబుతుందో చూద్దాం రండి: "ఎందుకంటే తానే స్వయంగా 'నేను నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను, నిన్ను యెడబాయను' అని చెప్పారు.  తద్వారా మనం ధైర్యంగా చెప్పవచ్చు "ప్రభువు నాకు సహాయకుడు; నేను భయపడను; మనిషి నన్ను ఏమి చేయగలడు? " (హెబ్రీయులు 13: 5-6). ఈ మాట  మనకు ఎంతటి నిశ్చయత ఇస్తుందో చూడండి. 

'ఎప్పటికి' అనే మాటకు అర్ధం ఏమిటో తెలుసా?  మనము ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు, ఆయన మనతో ఉంటాడు.  మనము దిగజారినప్పుడు, ఆయన మనతో ఉంటాడు.  మనము సంతోషంగా ఉన్నప్పుడు, ఆయన మనతో ఉంటాడు; మనము విచారంగా ఉన్నప్పుడు, ఆయన మనతో ఉంటాడు.  మనము సరిగ్గా ఉన్నపుడు, ఆయన మనతో ఉంటాడు, మనము తప్పినప్పుడు, ఆయన మనతోనే ఉంటాడు. (దుఃఖపడుతు 😞)  

మనతో ఉన్న యేసు మన శ్రేయస్సు, శాంతి, మరియు జ్ఞానం కాబట్టి, మనం అభివృద్ధి చెందుతాము. 

ఆమెన్!

No comments:

Post a Comment

దేవుని జ్ఞనము మనల్ని హెచ్చిస్తుంది.

ఫరో ఎదుట కల వివరిస్తున్న యోసేపు   "మరియు ఫరో-  దేవుడు   ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలె వివేక జ్ఞానములు గలవారెవరును లేరు.   నీవు నా ...